నాని నటించిన కొత్త చితం టక్ జగదీష్. విడుదలకు ఈ సినిమా సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై ముందే నుంచే రోజుకో వార్త హల్ చల్ చేసింది. మొత్తానికి సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాని నుంచి సినిమా వస్తుంది అంటే కుటుంబం మొత్తం కూర్చొని సినిమా చూడాలి అనుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా టక్ జగదీష్ సినిమాపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు ప్రతిదీ అనుమానమే అయిపోయింది. ముఖ్యంగా టక్ జగదీష్ సినిమాని థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే నాని మాత్రం ముందు నుంచి టక్ జగదీష్ ని థియేటర్ లోనే విడుదల చేయించాలని పట్టుపట్టారు. కానీ ఈ కరోనా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారో రారో అనే భయం ఒకటైతే, నిర్మాతల ఆర్థిక పరిస్థితులు చూసి చివరకు ఓటీటీకి ఇవ్వడానికి అంగీకారం తెలపాల్సి వచ్చింది. అయితే తాజాగా నాని మాట్లాడిన మాటలు పూర్తిగా వివరణ ఇచ్చాయి. ట్రైలర్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి 'టక్ జగదీష్' చిత్రాన్ని ఎందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చిందనే కారణం చెప్పారు.

సాహు గారపాటి మాట్లాడుతూ మొదటి వేవ్ తరువాత చాలా తెలుగు సినిమాలు బాగా ఆడాయి. కానీ  'వకీల్ సాబ్' చిత్రం మంచి టాక్ తో నడుస్తున్నప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో మంచి టాక్ తో మంచి వసూళ్లతో వెళ్తున్న చిత్రానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మా టక్ జగదీష్ సినిమా అలా కాకూడదు అనే ఇలా ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్నాం అన్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ భయం ఇంకా ఉంది. అందులోనూ పలు చోట్ల ఇంకా సింగిల్ స్క్రీన్లు ఓపెన్ చేయలేదు. ఏపీలో మూడు షోలే నడుస్తున్నాయి. ఓవర్సీస్ లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది'' అని 'టక్ జగదీష్' నిర్మాత తెలిపారు.

థియేటర్ లో చూడాలని ప్రేక్షకులకి ఉంటుంది. మేము కూడా థియేటర్ లోనే విడుదల చేయాలి అనుకున్నాం. పరిస్థితులు చూసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ సినిమాని ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేము. అందుకని ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. 'టక్ జగదీష్' ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా, సెప్టెంబర్ 10న అందరు సినిమా చూడండి అని సాహు గారపాటి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: