‘మా’ ఎన్నికల సమరం తారా స్థాయికి చేరుకున్న సమయంలో పూనమ్ కౌర్ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. జరగబోతున్న ‘మా’ సంస్థ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని కోరుకుంటూ అలాంటి నిజాయితీతో కూడిన వ్యక్తి ‘మా’ సంస్థ అధ్యక్షుడు అయితే తాను ఇండస్ట్రీలో పొందిన మోసాన్ని అవమానాన్ని ప్రకాష్ దృష్టికి తీసుకు వస్తానని కామెంట్ చేసింది.


ఈ కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఆ కామెంట్స్ వైరల్ గా మారడంతో తిరిగి పూనమ్ కౌర్ కు అప్పట్లో జరిగినట్లుగా చెప్పబడుతున్న అన్యాయం తిరిగి అందరికీ గుర్తుకు వచ్చేలా చేస్తోంది. అయితే పూనమ్ కౌర్ ఇలా కామెంట్స్ చేయడం వెనుక ఒక వెటకారం ఉందా లేకుంటే నిజంగానే ప్రకాష్ రాజ్ అధ్యక్షుడుగా ఎన్నిక అయితే ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ధైర్యంగా ప్రకాష్ రాజ్ కు చెపుతుందా అన్నది సమాధానం చెప్పలేని ప్రశ్న.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ జరగబోతున్న ‘మా’ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని చెప్పడం మరింత సంచలనంగా జరిగింది. ఈ కామెంట్స్ చేసిన కొద్ది సేపటికే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ తనకు దైవసమానులు చెప్పడంతో తాను ‘మా’ ఎన్నికల పోటీ నుండి తప్పుకుంటున్నాను అంటూ ఇచ్చిన ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.


లేటెస్ట్ గా మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీ రాజకీయాలకు చాల దూరంగా ఉంటున్న కృష్ణ ప్రభావం ‘మా’ సంస్థ ఎన్నికలను ఎలా ప్రభావం చేస్తుంది అన్న విషయం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఈపోటీలో పాల్గొంటున్న ఇరు వర్గాలు తమ సర్వశక్తులు ధారపోసి ఈసారి ‘మా’ ఎన్నికలలో చేస్తున్న ప్రచారం చూస్తుంటే అసలు మా సంస్థ అధ్యక్ష పదివికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అన్నది సస్పెన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: