సిద్ శ్రీరామ్ అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలనం. ఆయన పాడిన ఒక్కో పాటా ఒక్కో అద్భుతం. అసలు ఆయన వాయిసే అద్భుతం. ఆయన గాత్రం నుంచి జాలు వారిన పాటలు వింటే అలా వింటూనే ఉండాలని అన్పిస్తుంది. ఇప్పటి వరకూ తెలుగులో ఆయన పాడింది దాదాపు 56 పాటలు... అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్టే. సిద్ శ్రీరామ్ సాంగ్ పాడాడు అంటూ ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు. అంతేనా స్టార్ హీరోలకు సైతం సిద్ శ్రీరామ్ పాట పాడితే సినిమా హిట్. ఇటీవల వచ్చిన అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దానికి ఉదాహరణ. అయితే సిద్ శ్రీరామ్ తెలుగు వాడు కాదు. పైగా విదేశాల్లో పెరిగాడు. మరి ఈ చెన్నై చంద్రుడికి తెలుగు పై, సంగీతం పై అంతటి పట్టు ఎలా వచ్చాయి ? కేవలం తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా, ఏ రాగంలోనైనా, ఏ ఎమోషన్ ను అయినా అవలీలగా పాడేయగలడు. థన్ పాటతో ప్రేక్షకుల హృదయాలను కదిలించగలడు. సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు కదా... అంతటి టాలెంట్ ఆయన సొంతం.

సిడ్ శ్రీరామ్ లో తమినాడులోని చెన్నైలో జన్మించాడు. తమిళ కుటుంబానికి చెందిన సిద్ కు ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడే ఫ్రీమాంట్‌లో పెరిగాడు. ఆయనకు అద్భుతమైన సంగీత నైపుణ్యాలు రావడానికి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కర్నాటక సంగీత ఉపాధ్యాయురాలు అయిన ఆయన తల్లి లతా శ్రీరామ్ పోషించారు. సిద్ 3 సంవత్సరాల వయస్సు నుండి కర్ణాటక సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ అయ్యింది. 2008లో మిషన్ శాన్ జోస్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరాడు. అక్కడా సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత సౌత్ చిత్రపరిశ్రమలో తన ట్యాలెంట్ ను ప్రదర్శించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: