తమిళ హీరో సూర్యకు తమిళ్‌లో ఎంత క్రేజ్ ఉందో, టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లలో మంచి ర్తింపు ఉంది. అయితే సూర్య మాత్రం దక్షిణాదికే పరిమితమయ్యాడు గానీ.. ఇప్పటి వరకు ఉత్తరాదికి వెళ్లలేదు. హిందీ సినిమాల గురించి ఆలోచించలేదు. అయితే ఇప్పుడీ హీరో 'ఈటీ' సినిమాతో హిందీ మార్కెట్‌లో కూడా అడుగుపెడుతున్నాడు. సూర్యకి 'జై భీమ్' సినిమాతో హిందీ మార్కెట్‌లో కూడా క్రేజీ స్టార్డమ్ వచ్చింది. మద్రాస్‌ హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి చంద్రు కథాంశంతో రూపొందిన 'జై భీమ్' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అయింది. నార్త్ రీజియన్‌ నుంచి 'జై భీమ్'కి మంచి మార్కులే పడ్డాయి. సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రేజ్‌తోనే 'ఈటీ' సినిమాని హిందీలోనూ విడుదల చేస్తున్నాడు సూర్య.

సూర్య పేరు వినిపించగానే గజినీ, సింగం లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. స్టైలిష్, యాక్షన్ రోల్స్‌ కనిపిస్తాయి. అయితే ఇప్పుడీ ఇమేజ్‌కి భిన్నంగా రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తున్నాడు. సామాజిక అంతరాలని కథాంశాలుగా తీసుకొస్తున్నాడు. కడజాతి ప్రజలకి న్యాయం అందని ద్రాక్షలాగ మిగిలిపోయిందనే కథాంశంతో 'జైభీమ్' అనే సినిమా చేశాడు.

'జై భీమ్' సినిమా 1995 నాటి కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్య లాయర్‌ చంద్రుగా నటించాడు. అన్యాయంగా దొంగతనం కేసులో ఇరుక్కున్న గిరిజన స్త్రీ భర్త తరపున పోరాటం చేసిన మద్రాస్‌ హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి చంద్రు పాత్ర పోషించాడు సూర్య. ఈ సినిమా డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజైంది.

'జైభీమ్' సినిమాకి భాషతో సంబంధం లేకుండా చాలా తెలుగు, హిందీ అనే బేధం లేకుండా చిత్రపరిశ్రమలన్నిటి నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఇక ఇప్పుడీ సినిమా మరో రికార్డ్‌ కూడా క్రియేట్‌ చేసింది. ఈ ఏడాది మోస్ట్‌ సెర్చ్‌డ్‌ మూవీస్‌ లిస్ట్‌లో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో నిలిచింది 'జై భీమ్'. మరోవైపు ధనుష్ చాలా రోజుల క్రితమే హిందీ సినిమాలు చేశాడు. సౌత్‌ స్టార్లంతా డబ్బింగ్స్‌తో నార్త్‌కి వెళ్తోంటే, ధనుష్‌ మాత్రం హిందీలో స్ట్రయిట్ మూవీస్ చేశాడు. 'రాంజానా, షమితాబ్' సినిమాలతో అక్కడి ఆడియన్స్‌ని పలకరించాడు. ఇప్పుడు 'అత్‌రంగీరే' మూవీతో మరోసారి హిందీ ఆడియన్స్‌ ముందుకెళ్తున్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా విడులవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: