సినీ ఇండస్ట్రీలో వివాదాలు జరగడం ఏమి కొత్తకాదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని సందర్భాల్లో పాటలు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. అయితే పాటల విషయంలో వివాదాలు జరగడం చాలా సందర్భాలలో జరిగాయి. అలా ఎప్పటికీ చాలానే పాటలు వివాదాలకు దారితీశాయి. అయితే  2021లో వివాదాలకు దారి తీసిన పాటలు చాలానే ఉన్నాయి. అయితే నాగ శౌర్య రీతువర్మ కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను... అయితే ఈ సినిమాలో హిట్ అయినటువంటి పాట దిగు దిగు దిగు నాద.. ఈ పాటను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు అయితే ఈ పాటను ఐటమ్ సాంగ్ గా రాస్తారా అంటూ..

అప్పట్లో గొడవ చేసి ఈ పాటను రాసిన అనంత శ్రీరామ్ పై క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. అలాగే కే.ఏ అప్పట్లో బోనాల జాతర సందర్భంగా మంగ్లీ  పాడిన మైసమ్మ పాట మీద కూడా చాలానే వివాదాలు జరిగాయి. అయితే తన పాడిన పాటలు చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మ.. మోతెవరి ఇలాంటి పదాలు  అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాయి పేట హిందూ సంస్థలు దీనికి వ్యతిరేకంగా వివాదాలు చేశారు. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమాలో సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ సాంగో మనందరికీ తెలిసిందే.. ఈ పాట కూడా అనేకమైన వివాదాలను సృష్టించింది.

జానపద గేయాన్ని మార్చి రాసిన సుద్దాల అశోక్ తేజ దాని ఒరిజినల్ ను సేకరించిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వలేదని  అప్పట్లో భారీ గొడవలు జరిగాయి. అంతేకాకుండా ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే సినిమాలో కూడా భజగోవిందం అనే పాట తో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. భక్తి పాటలను ఐటమ్ సాంగ్ లాగా మార్చి రాస్తారా అంటూ గొడవలు జరిగాయి. ఆ పాటలో మగవారి మనోభావాలను దెబ్బతీసేలా ఈ పాట ఉంది అంటూ కొందరు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఏడాది విడుదలైన సినిమా లోని కొన్ని పాటలు ప్రేక్షకులను అలరించడం తో పాటు హలో వివాదాల్లో కూడా చిక్కుకోవడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: