2021 లో అక్కినేని హీరోలకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఓ పక్క నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఆల్రెడీ మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాతో కూడా ఈ ఏడాది మరో హిట్ కొట్టాడు. లవ్ స్టోరీతో నాగ చైతన్య హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చిన లవ్ స్టోరీ మూవీ ఫైనల్ గా ప్రేక్షకుల మనసులు గెలిచింది. చైతు కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల్లో లవ్ స్టోరీ నిలిచింది. సినిమాలో సాయి పల్లవి నటన కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో సారంగ దరియా సాంగ్ అదరగొట్టింది.  

నాగ చైతన్య హిట్లతో దూసుకెళ్తుండగా ఈ ఏడాది అఖిల్ తన కెరియర్ లో హిట్టు ఖాతా తెరిచాడు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల సినిమా తన కల నెరవేర్చింది. నాలుగు సినిమాల నుండి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు బ్యాచిలర్ తో మంచి హిట్ ఇచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ కూడా సినిమా సక్సెస్ కు తోడైంది. గోపీసుందర్ మ్యూజిక్ కూడా సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది.

2021 అక్కినేని యువ హీరోలకు కలిసి వచ్చింది. అయితే కింగ్ నాగార్జునకి ఈ ఏడాది నిరాశ తప్పలేదు. సోల్మన్ డైరక్షన్ లో నాగార్జున వైల్డ్ డాగ్ అంటూ ఓ ప్రయత్నం చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. సినిమా ముందు ఓటీటీ రిలీజ్ అనుకోగా క్రాక్, ఉప్పెన హిట్లు పడగానే నాగ్ డెశిషన్ మార్చుకున్నారు. కానీ థియేటర్ లో కన్నా ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రిలీజైనప్పుడే వైల్డ్ డాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: