విష్ణు విశాల్ తమిళ రాక్షసన్ సినిమాతో కోలీవుడ్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు, ఈ మూవీ ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు, ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది. ఈ మూవీ మాత్రమే  కాకుండా నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను సాధించిన బీమీలి కబడ్డీ  జట్టు సినిమా కూడా విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమనే, ఇలా డిఫరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకుల అలరించిన విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్, ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఎఫ్ఐఆర్ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది,  విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ తమిళ మూవీ  తెలుగులో కూడా ఒకే రోజు విడుదల కాబోతుంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ మూవీ ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు,  ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం తాజాగా మీడియాతో ముచ్చటించింది, అందులో భాగంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు అని చాలా మంది  అడుగుతుంటారుకదా.? అందుకే ఓ హీరోని పెళ్లి చేసుకున్నాను అని విష్ణు విశాల్‌ను చూపిస్తూ గుత్తా జ్వాలా నవ్వుకుంది, ఈ సినిమా  కోసం విష్ణు విశాల్ మరియు అతని టీం చాలా కష్టపడ్డారు అని గుత్తా జ్వాల చెప్పుకచ్చింది, మరి ఎఫ్ఐఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: