తెలుగు చిత్ర పరిశ్రమకు దేవదాసు సినిమాతో పరిచయమైన హీరో రామ్. ఆయన ఎన్నో సినిమాలో నటించినప్పటికీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం ఫుల్ రన్‌లో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం తరువాత రామ్ రెడ్ సినిమాలో నటించగా.. రెడ్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్‌లో ‘ది వారియర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెల్సిందే.

రామ్ ఈ సినిమాతో పాటు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం రామ్ 9 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని మొదట ప్రచారం జరిగింది. అయితే మరో సమాచారం ప్రకారం రామ్ 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ అడిగిన స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాత ఎవరో చూడాలి మరి.

అయితే దర్శకుడు బోయపాటి శ్రీను పలువురు నిర్మాతల దగ్గర ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా చర్చల దశలో ఉందని త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక.. రామ్ బోయపాటి శ్రీను కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. ఇక బోయపాటి శ్రీను కూడా ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళితే బడ్జెట్ ఏకంగా 70 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బోయపాటి బన్నీ, బోయపాటి పవన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతుండంగా.. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను తర్వాత సినిమాలో హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: