ఎన్నో సంవత్సరాల తర్వాత నాతి చరామి అనే మూవీలో నటిస్తున్నది పూనమ్ కౌర్. ఈ సినిమాకి జర్నలిస్ట్ నాగు గౌరవ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్ ని జరపడం జరిగింది.. ఆ తరువాత ఇంటర్వ్యూలో పూనం కొన్ని సంచలన విషయాలను కూడా తెలియజేసింది.. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

మొదటగా సినిమా అవకాశాల గురించి అలాగే తన  కంబ్యాక్ గురించి తెలియజేసింది.. ఇక పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇక్కడ ఇలా నిల్చుని మాట్లాడతాను అని అసలు అనుకోలేదు. కానీ అన్ని తన మంచికే జరుగుతున్నాయని తెలిపింది. తను కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా ఇలాంటి సినిమా చేస్తానని అనుకోలేదట. ఇక తన రియల్ లైఫ్ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ని విడుదల చేయాలనుకున్నాం.


పరిశ్రమలో కొందరు తనని పలు రకాలుగా పలు సందర్భాలలో నెగిటివ్ కామెంట్లు చేశారని తెలిపింది. ఎంతోమంది ఇండస్ట్రీలో తనని ఫుల్ చేయాలని చూశారు.. కానీ వారందరికీ తన వరకే సమాధానం చెబుతుంది అని చెప్పుకొచ్చింది. తనపై జరిగే కుట్ర గురించి కూడా తెలియజేసింది. ఇక తను చేసిన సినిమాలు కొన్ని ఇప్పటికీ విడుదల కాలేదని తెలిపింది. చాలా పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చినా పలు రకాల కారణాలతో తను బయటికి వచ్చేశానని తెలిపింది. దానికి కారణం వేరే ఉందని వెల్లడించింది.

పూనమ్ కౌర్ నటిగా ఎదగక పోవడానికి కారణం రావణుడు అంటూ వ్యాఖ్యానించింది.. తన కెరియర్నీ రావణులు చెడగొట్టారని ఆరోపిస్తోంది.. అయినప్పటికీ కూడా తన సీత, ద్రౌపది వంటి వారి స్ఫూర్తితో నిలదొక్కుకున్నానని తెలిపింది.. ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన చెందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: