ఒక వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మరో వైపు తాను లీడ్ రోల్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది అనసూయ. తాజాగా ఈ హాట్ యాంకర్ దర్జా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనసూయ లీడ్ రోల్ చేస్తుంది. అయితే అది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఒక గ్యాంగ్ స్టర్ నాయకురాలిగా అనసూయ ఈ సినిమాలో నటించబోతుంది. తనకు ఎదురు వచ్చిన ఎంతటి వారైనా సరే తొక్కుకుంటూ వెళ్లే పాత్రలో అనసూయ కనిపిస్తుంది.ఇక అందం పొగరు కలగలిపిన కనకమహాలక్ష్మి పాత్రలో అనసూయ ఈ సినిమాలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను సురేష్ బాబు చేతుల విడుదల చేశారు. ఆ టీజర్ లో అనసూయ లుక్ ఇంకా సన్నివేశాలను చూస్తుంటే ఈ సినిమాపై ఆసక్తి కలుగుతోంది. కనకమహాలక్ష్మి అక్రమ సామ్రాజ్యం లోకి పోలీసు అయిన యాక్టర్ సునీల్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ పోలీస్ ను అనసూయ ఎలా ఎదిరించింది అనేది ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది.



టీజర్ లో డైలాగ్స్ విషయానికి వస్తే "ఎవరైనా ఈ కనకాన్ని టచ్ చేసేందుకు ట్రై చేశారా బందల కోట బద్దలైపోద్ది. కాలినప్పుడు కుర్చీలు గట్రా వేయకూడదురా ఖాకీ.నేను చీర కట్టిన శివంగిని రా నేను వేటాడితే ఎలా ఉంటదో వాడికి తెలియాలి"అంటూ అనసూయ చెప్పిన డైలాగ్స్ అయితే అదరహో అన్నట్లుగా ఈ టీజర్ లో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె లుక్ అయితే చాలా పవర్ ఫుల్ గా అలాగే అందంగా కూడా ఉంది.ఇక అందంతో పాటు పొగరు కలగలిసిన కనకమహాలక్ష్మి నిజంగానే శివంగి తరహాలో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాతో అనసూయ ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్ హిట్ ను దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఈ సినిమాని సలీమ్ మాలిక్ డైరెక్ట్ చేస్తుండగా రాప్ రాక్ షకీల్ సంగీతాన్ని అందించాడు. పీఎస్ఎస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో శివ శంకర్ పైడిపాటి ఈ సినిమాని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: