ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా `హరి హర వీరమల్లు`. క్రిష్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తోలి జానపద చిత్రమిది.17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్యం నాటి కథగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆ కాలం నాటి రాబిన్ హుడ్ తరహా బందిపోటు గా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.ఇక గత కొంత కాలంగా కరోనా వైరస్ ఒమిక్రాన్ ల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ లో మొదలైంది. పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో భారీ సెట్ లని కూడా ఏర్పాటు చేశారు.



 గ్రీన్ మ్యాట్ లో కీలక పోరాట ఘట్టాలని షూట్ చేస్తున్నారు.అంతే కాకుండా భారీ సెట్ లలోనూ షూటింగ్ అనేది జరుగుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో రోషనారగా బాలీవుడ్ సెక్సీ లేడీ నర్గీస్ ఫక్రీ కూడా కనిపించబోతోంది.ఇక ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపల్ నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ బంది పోటు దొంగ హరి హర వీరమల్లు గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే కథానుగుణంగా సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన గెటప్ లలో  కనిపించనున్నారని తెలిసింది. అంతే కాకుండా సినిమాలో దాదాపుగా 30 రకాల థీమ్ డ్రెస్సుల్లో పవన్ కళ్యాణ్ కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారని అవి సినిమాకు ఎంతో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: