టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్లలో ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది.అయితే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే పలు సీన్లు తొలగించారనే టాక్ బాగా విపిస్తుంది.ఆచార్య సినిమాలో కాజల్ హీరోయిన్ అని ప్రకటించారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంకా అలాగే టీజర్‌లో కూడా కాజల్‌ను చూపించారు.అయితే ఆ తర్వాత మాత్రం పాపం కాజల్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఆచార్య టీం. కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తొలగించినట్లు కొరటాల సినిమా విడుదలకు ముందు చెప్పేసాడు. ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లలో బాగా సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో ఇప్పుడు మరో నటుడు సీన్లు కూడా తొలగించినట్లు అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి.



మామూలుగానే సినిమాలో నటించే నటుల సీన్లు ఎడిటింగ్ కు గురైపోతే ఎవరికైనా సరే చాలా బాధగా వుంటుంది. మంచి సీన్లు లేపేసారు అని వారంతా కూడా చాలా బాధపడుతుంటారు. అయితే ఓ పెద్ద సినిమాలో పైగా మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప హీరో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు వారి నటనకు తమ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించినప్పుడు కూడా ఇలాంటివి జరిగితే ఆ బాధ చాలా ఎక్కువ అవుతోంది. ఇప్పుడు ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను విషయంలో కూడా ఇదే జరిగింది. జబర్దస్త్ లో మంచి టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ కమెడియన్ గా పేరు వున్న గెటప్ శ్రీను కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయిందని ఇండ్రస్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.. ఆచార్య సినిమా కోసం గెటప్ శ్రీను ఎక్కువ రోజులు కాల్ షీట్స్ ఇచ్చి నటించాడని ఇంకా అతనికి మాంచి కామెడీ పార్ట్ పెట్టారని సమాచారం తెలిసింది.. కానీ ఫైనల్ ఎడిట్ లో అతని కామెడీ పార్ట్ మొత్తం లేచిపోయిందని సమాచారం తెలుస్తుంది.పాపం దీంతో అతను చాలా బాధలో వున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: