ఇప్పటి వరకు బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ పెయిర్‌కి అక్కడ వన్‌ ఆఫ్ ది బెస్ట్‌ పెయిర్స్‌ అనే ఇమేజ్ ఉంది. కరీనా కంటే సైఫ్‌ 10 ఏళ్లు పెద్దోడయినా.. ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉన్నా.. వాళ్ల కెమిస్ట్రీకి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. బెస్ట్‌ పెయిర్‌ అని కాంప్లిమెంట్స్‌ కూడా ఇస్తుంటారు. అయితే ఇప్పుడీ జంట విడిపోతుందని, సైఫ్‌ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.

సైఫ్ అలీ ఖాన్‌ సోషల్‌ మీడియాకి దూరంగా, ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటాడని అందరికీ తెలుసు.  పిల్లలు వెకేషన్స్‌తో బిజీగా ఉంటాడని చాలామంది అంటుంటారు. అయితే ఇప్పుడీ ఫ్యామిలీమెన్‌ రెండో భార్యకి కూడా విడాకులు ఇస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీనా కపూర్‌కి విడాకులిచ్చి సైఫ్‌ అలీఖాన్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. సైఫ్ అలీ ఖాన్ 2012 కరీనా కపూర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు సైఫ్‌ వయసు 41 ఏళ్లు. కరీనాకి 31 ఏళ్లు. ఇద్దరి మధ్య 10 ఏళ్లు గ్యాప్‌ ఉన్నా.. ప్రేమకి, పెళ్లికి ఆ వయసు బేధం పెద్ద అడ్డంకిగా మారలేదు. వీళ్లకి ఇద్దరు పిల్లలు తైముర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్‌ ఉన్నారు. ఈ ఇద్దరికీ సోషల్‌ మీడియాలో ఫుల్ క్రేజ్‌ ఉంది‌.

సైఫ్ అలీ ఖాన్‌కి కరీనా కంటే ముందు అమృతా సింగ్‌తో పెళ్లి అయింది. సైఫ్‌ కంటే 13 ఏళ్లు పెద్దది. అమృతకి 31, సైఫ్‌కి 21 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. 1991లో పెళ్లి చేసుకున్న వీళ్లు, ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహిం అలీ ఖాన్ పుట్టాక 2004లో విడిపోయారు. అమృతతో విడిపోయాక 4 ఏళ్లకి కరీనాని పెళ్లి చేసుకున్నాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ రీసెంట్‌గా పరిణీతీ చోప్రాతో ప్రేమలో పడ్డాడట. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం పరిణీతి చోప్రా ఒక ఇంటర్వ్యూలో సైఫ్ అంటే ఇష్టమని చెప్పింది. పెళ్లి చేసుకునే అవకాశం వస్తే వదిలిపెట్టనని కూడా స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.

ప్రియాంక చోప్రా కజిన్‌గా సినిమాల్లోకి వచ్చింది పరిణీతి చోప్రా. 'ఇషక్‌జాదే, గోల్‌మాల్ ఎగైన్' లాంటి సినిమాలతో ఓకే అనిపించుకున్నా.. పరిణీతికి పెద్దగా స్టార్డమ్‌ రాలేదు. అరకొర సినిమాలతో కెరీర్‌ని యావరేజ్‌గా నెట్టుకొస్తోంది. ఇక ఇప్పుడు సైఫ్‌ని పెళ్లి చేసుకొని సెటిల్‌ కాబోతోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక సైఫ్‌, పరిణీతికి మధ్య 18 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. సైఫ్‌ ఫిఫ్టీస్‌లో ఉంటే, పరిణీతి ఇంకా థర్టీస్‌లోనే ఉంది. అయితే ఈ పెళ్లి ప్రచారంపై అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: