ఇక టాలీవుడ్ లో కామెడి చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి జంధ్యాల గారి స్టయిల్ ని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. కారణం అనిల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో జంధ్యాల గారి కామెడీ మార్క్ అనేది కనిపించడమే.ఎఫ్ 2 చిత్రంలో అంతేగా అంతేగా అంటూ ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించి మంచి ఫీల్ అందించడంలో దర్శకుడు అనిల్ బాగా సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్  ఇంకా వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 3' కూడా ఇటీవలే థియేటర్లకు వచ్చింది. 17 రోజుల్లో ఈ చిత్రం 50 కోట్ల పైగా షేర్ ను రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన వెంటనే ఈ చిత్రం ఆశించినస్థాయిని అందుకోలేకపోయిందనే టాక్ వచ్చింది.నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినా కూడా హిట్ అంటూ కవర్ చేస్తున్నారు మేకర్స్.అలాంటి నెగిటివ్ టాక్ రావడంతో ముందుగా అనుకున్నట్టుగా 'ఎఫ్ 4' సినిమా అనేది ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.


ఇక ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..ఈ 'ఎఫ్ 3' చిత్రం మేము అనుకున్నట్టుగానే ఆడియన్స్ చాలా ఫాస్టుగా కనెక్ట్ అయింది. అందరూ కూడా ఈ మూవీని చాలా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ మూవీ సీక్వెల్ విషయంలో మేము అసలు మనసు మార్చుకోలేదు. 'ఎఫ్ 4' సినిమా కచ్చితంగా ఉంటుంది .. అందులో అసలు ఎలాంటి సందేహం లేదు. నా తదుపరి చిత్రం నందమూరి బాలకృష్ణగారితో ఉంటుంది ..ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి మేము తీసుకుని వెళతాము. ఇక బాలకృష్ణగారు ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారు. బాలయ్య బాబు సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలు చాలా భారీగా ఉంటాయి. ఇక అందుకు తగిన విధంగానే ఈ సినిమాలోని అన్ని అంశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: