ఇటీవలి కాలం లో బుల్లితెర  కార్యక్రమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. వినూత్నమైన కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బుల్లితెర కార్యక్రమాల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం కూడా ప్రతివారం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతి వారం కూడా ఒక సెలబ్రిటీ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇక వారి కెరీర్ విశేషాలను పంచుకుంటూ ఉంటారు.


 ఇలా తన షో లోకి వచ్చిన సినీ సెలబ్రిటీలను ప్రేక్షకులు ఏ ప్రశ్నలు అయితే అడగాలి అనుకుంటున్నారో అలాంటి ప్రశ్నలు అడిగి ఆసక్తికర సమాధానాలు రాబడుతూ ఉంటాడు వ్యాఖ్యాత అలీ. అయితే ఇటీవలే వచ్చేవారం ఆలీతో సరదాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. ఇప్పుడు ప్రోమోలో చూసుకుంటే ఇక ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా హీరోయిన్ అర్చన అతని భర్త జగదీష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అర్చన జగదీష్ వాళ్ల లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు.


 అంతే కాకుండా అర్చన తన కెరీర్ ఎలా సాగింది అనే విశేషాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఇద్దరు భార్య భర్తల గురించి పలు పర్సనల్ విషయాలు కూడా అడిగారు అలీ. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్ అని అడగగా.. నేను ఎక్కువ రొమాంటిక్ అంటూ హీరోయిన్ అర్చన చెప్పింది. భర్త జగదీష్ కూడా తన భార్య ఎక్కువ రొమాంటిక్ అంటూ చెప్పాడు. తర్వాత ఇద్దరి లో ఎవరు ఎక్కువ అబద్ధాలు చెబుతారు అని అడుగగా.. నేను అంటూ అర్చన భర్త చెబుతాడు. దీంతో పక్కనే కూర్చుని అర్చన షాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: