గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏమిటంటే రణవీర్ సింగ్.. ఈ హీరో చేసిన కొన్ని బోల్డ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఆ ఫోటోల పైన ప్రతి ఒక్కరూ పలు విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కొత్తగా ప్రజెంటేషన్ చేయాలి అంటే ఈ హీరోకి సాధ్యమని చెప్పవచ్చు. అలా ఈసారి తన కొత్తదనం కోసం నగ్న ఫోటోషూలతో వివాదాలకు తెర లేపారని చెప్పవచ్చు. ఇక తన ఏ పని చేసినా కూడా ఎక్కువగా హెడ్లైన్స్ లో నిలుస్తూ ఉంటారు.


ఇక ఈ ఫోటోలు ఒక ప్రముఖ మ్యాగ్జైన్ కోసం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో పలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక ఎవరికి తోచిన విధంగా వారు అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా బెంగాలి నటి, ప్రముఖ రాజకీయ నాయకురాలు మిమి చక్రవర్తి తన ట్విట్టర్లో రణవీర్ సింగ్ నగ్న ఫోటోల గురించి తాను ఏమనుకుంటుందో తెలియజేసింది.. రణవీర్ సింగ్ చేసిన పనికి ప్రశంసిస్తూనే లింగ సమానత్వ సమస్య గురించి కూడా ఆమె ఒక ప్రశ్న వేయడం జరిగింది.. ఇలాంటి ఫోటోషూట్లలో ఎవరైనా స్ర్తీ పాల్గొన్నట్లు అయితే ఇదే స్పందన లభిస్తుందా అంటూ ఆమె ప్రశ్నించింది.


రణవీర్ సింగ్ తాజా ఫోటోతో ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది అని తెలియజేస్తూ కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది.. ఇలా చేసింది ఒక స్ర్తి అయితే ఇన్ని ప్రశంసలు ఉండేవా అన్నట్లుగా ఆమె ఆశ్చర్యాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా పలు ఆసక్తికరమైన పోస్టులను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. 1972లో మ్యాగజైన్ షూటింగ్లో నగ్నంగా కనిపించిన పాప్ ఐకాన్ వర్క్ రెనాల్ట్ కు రణవీర్ సింగ్ నివాళి అర్పిస్తూ తన నగ్న ఫోటోలలో కనిపించారు.ప్రస్తుతం సర్కస్ అనే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు రణవీర్ సింగ్సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ సినిమాలో పూజ హెగ్డే , జాక్వెలిన్ హీరోయిన్గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: