ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టుకొని ఫుల్ స్పీడ్ లో ఉన్న యంగ్ హీరోలలో నాగ చైతన్య ఒకరు. నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. అలాగే ఆగస్ట్ 11 వ తేదీన నాగ చైతన్య నటించిన మొట్ట మొదటి హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డా హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ లో అమీర్ ఖాన్ హీరోగా నటించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది.  

అలాగే ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే తమిళ క్రేజీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే కూడా చాలా రోజులు అవుతుంది. అలాగే పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య ఒక మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయి ఉన్న నాగ చైతన్య మరో క్రేజీ దర్శకుడి మూవీ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

డీజే టిల్లు మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగ చైతన్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమల్ కృష్ణ , నాగ చైతన్య కు ఒక కథను వినిపించగా, ఆ కథ బాగా నచ్చిన నాగ చైతన్య వెంటనే ఈ దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్ లు అన్నీ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: