తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరు సంపాదించుకొని ఎనలేని ఖ్యాతిని సంపాదించిన నందమూరి తారక రామారావు అప్పట్లో ఇండస్ట్రీలో ఎంతలా హవా నడిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తరానికి ఒక్కడు అనే రేంజ్ లో ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఇప్పటికి కూడా ఎంతోమంది అభిమానులు ఆయన సినిమాలను ఆయన చేసిన పాత్రలు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు సాంఘిక పౌరాణిక జానపదం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జానర్ లలో కూడా సినిమాలు చేసి తనకు తిరుగు లేదు అని నిరూపించారు నందమూరి తారక రామారావు.


 ఇక ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమాలో సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు అని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా అన్నగారి సరసన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊర్వశి శారద నటించారు. అయితే జస్టిస్ చౌదరి సినిమా లో అన్న గారికి ఎక్కడ తక్కువ కాకుండా శారద నట విశ్వరూపం చూపించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇక ఊర్వశి శారద ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి సినిమా 100 రోజులు ఆడుతుంది అనుకుంటే 250 రోజులు ఆడి దిగ్విజయం సాధించింది.


 ఈ క్రమంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఊర్వశి శారద స్పెషల్ గా వచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే అన్నగారిని అక్కడున్న వారందరూ పొగడ్తలతో ముంచెత్తారు. అక్కడికి వచ్చిన కొంతమంది సినీ క్రిటిక్స్ మాత్రం అన్న గారి కంటే ఊర్వశి శారద నటన లో విశ్వరూపాన్ని చూపించింది అని పొగడ్తలు కురిపించారు. ఇక ఈ మాటలతో అన్నగారు హర్ట్ అయ్యారు. తనను పొగడకుండా ఊర్వశి శారదను పొగిడారు అని కాదు సినిమాలోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోకుండా పైపైనే సినిమాను అర్థం చేసుకొని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన చెందారట. ఇక ఈ సినిమా న్యాయవాది వ్యవస్థపై  ఎంతగానో ప్రభావం చూపుతుందని అన్నగారు అనుకున్నారు. కానీ పెద్దగా ప్రేక్షకులను సినిమా లోని అంతరార్ధం ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు అనే ఆవేదన అన్నగారికి ఉండేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: