టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ మూవీ లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఈ యువ హీరో మా వింత గాధ వినుమా , కృష్ణ అండ్ హిస్ లీల అనే మూవీ లలో హీరోగా నటించాడు.

ఈ రెండు మూవీ లు కూడ థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా,  ఈ మూవీ సిద్దు జొన్నలగడ్డ కు అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను కూడా తీసుకు వచ్చింది. ఇలా డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ గా డీజే టిల్లు పార్ట్ 2 ని తెరకెక్కించబోతున్నారు. డీజే టిల్లు మూవీ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా , ఈ దర్శకుడు డీజే టిల్లు పార్ట్ 2 మూవీ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే డీజే టిల్లు మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కూడా డీజే టిల్లు పార్ట్ 2 మూవీ లో కనిపించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. డీజే టిల్లు పార్ట్ 2 మూవీ లో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీ లీల ను హీరోయిన్ గా మూవీ యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: