తెలుగు హిస్టారికల్ చిత్రాలలో ఒకే సంవత్సరం విడుదలైన రెండు ప్రతిష్టాత్మకంగా చిత్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది.. ఈ రెండు కూడా చరిత్ర ఆధారత చిత్రాలు కావడం గమనార్హం. అవి కూడా తెలుగులో చరిత్ర సృష్టించిన సినిమాలు కావడం మరింత ఆసక్తికరంగా మారుతోంది.. కోర్టు నోటీసులు పంపడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వాల నుంచి వినోదపన్ను రాయితీగా తీసుకొని ఈ రెండు సినిమాలు కూడా దానికి సంబంధించి వాటిని ప్రేక్షకులను పంచకపోవడంపై సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది.



ఇక ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాల నటులకు, దర్శకులు, నిర్మాతలకు తాజాగా నోటీసు జారీ చేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాకి పన్ను రాయితీ తీసుకొని టికెట్టు రేట్లు తగ్గించకుండా అలాగే అమ్మడంతో వినియోగదారుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీంతోపాటు ఈ సినిమా నిర్మాతలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతి వాదులందరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కోర్టు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యాన్ని తెలియజేసినట్లు సమాచారం.


మరొకవైపు డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి ఈ రెండు చారిత్రాత్మకంగా సినిమాలు కావడం వల్ల అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ సినిమాలకు పన్ను రాయితీ ఇచ్చింది. అయితే ఈ పన్ను రాయితీని ప్రజలకు ఇవ్వలేదు దీంతో రాయితీ పొందిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్లు తెలియజేయడం జరిగింది. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ వివరణ ఇవ్వాల్సిందిగా హీరో బాలకృష్ణకు దర్శకులకు నిర్మాతలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రేక్షకుల సైతం ఒకసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: