
ఒకే ఒక జీవితం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తన తల్లిని బతికించుకోవడం కోసం టైం ట్రావెల్ తో హీరో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు.. ఇక అదే పాయింట్తో ప్రాజెక్ట్ -k రూపొందుతున్నట్లుగా సమాచారం. అయితే ఒకే ఒక జీవితం సినిమాలో మాత్రం టైం ట్రావెల్ అనే పాయింట్ కి బాగా చూపించడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ -k సినిమా కూడా ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు సినిమా కథలు ఒకటే అన్నట్లుగా వార్తలు వైరల్ గా మారాయి.. ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరోక్షంగా స్పందించడం జరిగింది.
ఇక అందుకోసం నాగ్ అశ్విన్ తన ఇంస్టాగ్రామ్ లో ఇలా స్టేటస్ పెడుతూ.. ప్యారడైజ్ వద్ద బస్సు ఆగి అక్కడ దిగిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ బిర్యాని తినలేరని తెలియజేశారు. ఆ విధంగా తన సినిమాపై వస్తున్న వార్తలను ఖండించడం జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి రూ.550 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అమితాబచ్చన్, దీపికా పడుకొనే తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. వచ్చేయేడాది అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.