తమిళ డైరెక్టర్ కస్తూరి రాజా పలు క్లాసికల్ సినిమాలు తమిళ ఇండస్ట్రీలతో మంచి డైరెక్టర్గా గుర్తింపు సంపాదించారు. అయితే ఇతని కుమారుడు ధనుష్ మొదట హీరోగా వెండితెరకు పరిచయం చేశారు ఆ తర్వాత చాలా ట్రోలింగ్స్ రావడంతో అతనికి హీరోగా పనికిరాడు అంటూ మొహం మీద చెప్పేవారట. అయితే అలాంటి కొడుకుని హీరోగా నిలబెట్టడానికి కస్తూరి రాజా పలు ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలించలేదు కానీ పెద్ద కుమారుడు సెల్వ రాఘవన్ మాత్రం పలు ప్రయోగాలతో తమ్ముడికి ఒక మంచి నటుడుగా చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు.


అలా మొదట డైరెక్షన్ చేసిన సినిమా కాదల్ కొండెన్ ఈ సినిమా ద్వారా నటుడుగా మరొక మెట్టు ఎదిగాలని చెప్పవచ్చు విచిత్రాన్ని తెలుగులో నరేష్ నేను అనే టైటిల్తో రీమిక్స్ చేయడం జరిగింది. అయితే ధనుష్ ఎక్కువగా తన అన్న రాఘవన్ సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే  చిత్రాన్ని..మొదట వెంకటేష్ తీసిన తర్వాత ధనుష్ తమిళంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేసి విడుదల చేయగా మంచి విజయాన్ని అందుకున్నారు.


ఇక ఆ విధంగా తన తమ్ముడికి వరుస సక్సెస్ అందించిన డైరెక్టర్ రాఘవ 7/g బృందావన్ కాలనీ అలాగే యుగానికి ఒక్కడు వంటి చిత్రాలతో దర్శకుడుగా మరింత స్థాయిని పెంచుకున్నారు. అయితే హీరోయిన్ అనుష్కతో వర్ణ సినిమాని ఎప్పుడు తీశాడో అప్పటినుంచి తన పతనం మొదలైంది అని చెప్పవచ్చు. ఇక హీరో సూర్యతో కలిసి NGK సినిమాని తెరకెక్కించక ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్గా మళ్లీ ధనుస్సు సెల్వ రాఘవన్" నేనే వస్తున్న" అనే చిత్రాన్ని డైరెక్షన్ చేశారు. ఈ సినిమా తమిళంలో పెద్దగా ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ చూపలేదు. మరి సినిమా మౌత్ టాక్ వల్లనే ఏమైనా నిలబడుతుందేమో చూడాలి. డైరెక్టర్ సెల్వ రాఘవన్ యుగానికి ఒక్కడు -2 సినిమా షూటింగ్ త్వరలోనే రాబోతున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: