కొన్నిసార్లు కొన్ని మంచి సినిమాలు హీరోలకు చేజారుతూ ఉంటాయి. అవి వేరే హీరోలు చేయడం వాటి ద్వారా వారు భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రభాస్ హీరోగా నటించవలసిన ఓ సినిమా తమిళ హీరో చేసి ఆయన భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధంగా ఒక మంచి సినిమా అవకాశాన్ని చేజార్చుకోవడం ఆయన అభిమానులను ఇంకా కలిచి వేస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తమిళంలో జయం రవి హీరోగా నటించిన తని ఒరువన్ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

సినిమా ద్వారా ఇటు హీరో మరియు దర్శకుడు ఇద్దరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల ముందుగా ప్రభాస్ కు చేయాలని భావించానని మోహన్ రాజా చెప్పడం జరిగింది. ఆయన తెలుగులో ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ అనే సినిమాను చేయగా ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. 

ప్రభాస్ కు ఈ సినిమా యొక్క కథను వినిపించడం జరిగిందని అయితే అప్పటి పరిస్థితుల రీత్యా ఆయన ఇతర కమిట్మెంట్లు ఉండడం వల్ల ఈ సినిమా చేయడం జరగలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా త్వరలోనే అలాంటి ఓ కథను రెడీ చేసి ప్రభాస్ కు వినిపిస్తానని చెప్పడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. త్వరలోనే వీరి కలయికలో సినిమా రావడం నిజంగా మంచి విషయం అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకున్న ప్రభాస్ ఈ దర్శకుడు తో సినిమా చేయడం ఎంతవరకు వీలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో ధ్రువ పేరుతో రామ్ చరణ్ రీమేక్ చేయగా అది కూడా సంచలన విజయాన్ని అందుకుంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: