సాధారణంగా ఎక్కడైనా సరే నిప్పు లేకుండానే పొగరాదు. కానీ టాలీవుడ్ లో మాత్రం నిప్పు లేకుండానే పొగ తెగ వచ్చేస్తుంది.. అతను ఒక స్టార్ డైరెక్టర్ మరి

మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకొని మళ్లీ మల్టీ స్టారర్ సినిమా తీసి కాస్త బోల్తా పడ్డాడని చెప్పవచ్చు. ఆ తర్వాత మరొక చిన్న సినిమా తీసినా సరే బజ్ లేకపోయింది. ఇక ఎలాగోలా ఒక రీమేక్ చేసి ఓకే అనిపించుకున్నాడు. అయినా కూడా ప్రస్తుతం ఈయన చేతిలో ఒక సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.

మొత్తం మీద ఒక చిన్న సినిమా పట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది కానీ సినిమా కెరియర్ అలా అలా ముందుకు వెనక్కు నడుస్తున్న సమయంలో ఒక హీరోయిన్తో ప్రేమాయణం మాత్రం బాగానే నడుస్తుందని అప్పుడే గాసిప్స్ ప్రారంభం కూడా అయిపోయాయి. మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ ని ఇతగాడు పట్టేసాడు అని, కానీ ఆమె ఇతడిని ఎలా లైక్ చేస్తోందనే ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ పెద్దగా అందగాడు కూడా ఏమీ కాదు..

కనీసం ఉషారైన వాడు కూడా కాదు.. అలాంటి వాడితో ఒక అమ్మాయి  అలా ఎలా ప్రేమలో పడింది అనేది సినిమా రంగంలో ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయంపై తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి పడుతుంది అంటే మనమే ట్రై చేసే వాళ్ళవేమో అని ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారని  మనం చెప్పవచ్చు.

నిజానికి సినిమాల్లో సక్సెస్ రాకపోయినా ఈ డైరెక్టర్ పెద్దగా అందగాడు ఏమీ కాకపోయినా ఒక అందమైన హీరోయిన్ ని ట్రాప్ చేయడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. మరి కొంతమంది ఏమో ఆ అమ్మాయి టాలెంటును, అందాన్ని ఉపయోగించుకొని సినిమాను తీసి డబ్బు పోగు చేసుకునే ప్రయత్నం మీద ఇలా ప్రేమిస్తున్నానని కహానీలు అల్లుతున్నాడేమో.. పని అయ్యాక ఆమెను వదిలేస్తాడేమో అన్న వార్తలను కూడా బాగా వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ డైరెక్టర్ కైతే ఆ అందమైన హీరోయిన్ పడిపోయిందనే గుసగుసలు కూడా బాగానే వినిపిస్తూ ఉండడం గమనార్హం మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: