మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ధృవ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తని ఒరువన్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. తని ఒరువన్ సినిమాకు మోహన్ రాజా డైరెక్టర్ కాగా జయం రవి ఈ సినిమాలో హీరోగా నటించారు.

ధృవ సినిమా గురించి మోహన్ రాజా మాట్లా డుతూ ప్రభాస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కథ రాశానని తెలిపారు. అయితే ప్రభాస్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ ధృవ సినిమాలో నటించి ఈ సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకుల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.
భవిష్యత్తులో ప్రభాస్ మోహన్ రాజా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. ప్రభాస్ సైతం మోహన్ రాజా లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రాబోయే రోజుల్లో మోహన్ రాజాకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. 2023 సంవత్స రంలో ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధించినా ప్రభాస్ కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: