మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ మెగా 154 అనే టైటిల్ తో ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటు వంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

రవితేజ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిమూవీ లో గ్యాంగ్ లీడర్ , ముఠా మేస్త్రి టైమ్ లో చేసిన పాత్రల  లాంటి పాత్రను ఈ మూవీ లో పోషించినట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో వెంటేజ్ చిరంజీవి కనిపించే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో మెగా అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ మరియు టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: