రవితేజ హీరోగా వరుస సినిమాలను చేస్తూనే ఇంకొక వైపు కొన్ని కీలకమైన పాత్రలు పోషించడానికి అంగీకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా లో ఓ కీలకపాత్రలో నటించడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన పాత్రకు సంబంధించిన చాలా వివరాలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఆయన పాత్ర పేరు ఇప్పుడు బయటికి రావడం అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.

వైజాగ్ రంగనాథ్ అనే పేరుతో ఈ సినిమాలో రవితేజ నటించబోతున్నాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయన పోషించే పాత్ర మెగాస్టార్ చిరంజీవికి సవతి తమ్ముడు గా ఉంటుంది అని, వీరిద్దరికి ఒక క్షణం కూడా ఒకరంటే ఒకరు పడదని, తప్పకుండా వీరిద్దరి మధ్య పోరు ప్రేక్షకులను ఆసక్తి పరిచే విధంగా ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. మొదటగా ఈ పాత్రకు ఒక నార్మల్ నటుడునే అనుకున్న కూడా ఒక స్టార్ హీరో అయితే ఈ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని సినిమాకి కూడా మంచి క్రేజ్ వస్తుందని భావించి రవితేజను ఎంపిక చేశారట చిత్ర బృందం.

ఎలాగో రవితేజ చిరంజీవికి వీరాభిమాని కాబట్టి ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోడు కాబట్టి ఈ సినిమాను ఆయన చేయడం జరిగింది. ఇక ఈ సినిమా యొక్క టీజర్ ను అలాగే టైటిల్ ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఆ రోజునే ప్రకటించబోతుంది. భాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఇటు శ్రుతి హసన్ కి కూడా ఈ సినిమా ఎంతో ముఖ్యమైన సినిమా అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: