
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం షూటింగు ప్రారంభించబోతున్నాము. వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని ఆశిస్తున్నామని అల్లు అర్జున్ తెలిపారు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బన్నీపై ఫోటోషూట్ జరిగింది. మరొకవైపు బ్యాంకాక్ - శ్రీలంక అడవుల్లో అరుదైన లొకేషన్ లను వెతికేందుకు చిత్ర బృందం ప్రయత్నాల్లో ఉందని సమాచారం. బ్యాంకాక్ అడవుల్లో పులితో బన్నీ భీకరమైన ఫైట్ ని చిత్రీకరిస్తారని కూడా లీక్ అయింది. అంతేకాదు రియలిస్టిక్ గా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చిత్ర బృందం తెలిపినట్లు సమాచారం. ఇకపోతే 2023 డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పులితో పోరాటం చేసిన సన్నివేశంతో పోల్చుకుంటున్నారు. ఇక ఇద్దరిలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్ అవుతారో అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక దాక్షాయినిగా అనసూయ , మంగళం శీను పాత్రలో సునీల్ , బన్వర్ సింగ్ సేఖవత్ పాత్రలో ఫాహాధ్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది...