టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి టాలీవుడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 122 కోట్ల గ్రాస్ వసూళ్లు కొళ్లగొట్టి స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారని ఈ సినిమా నిరూపించింది. ఇక ఈ సినిమా విజయంతో జాతీయ స్థాయిలో మెరిశారు కథానాయకుడు నిఖిల్ . ఈ సినిమాతో నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇక ఇప్పుడాయన '18 పేజెస్' సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ అందించిన కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తు పరిచయం అవుతున్నాడు.
దర్శకుడు సుకుమార్ చాలా చక్కటి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రారంభించుకుంది.ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మంగళవారం తెలియజేశారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. గోపీ సుందర్ స్వరాలందిస్తున్నారు. ఎ.వసంత్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.'కార్తికేయ 2' ఉత్తరాదిలో సైతం భారీ విజయం సాధించడంతో ఇప్పుడు '18 పేజీస్'పై అక్కడి ప్రేక్షకుల దృష్టి పడింది. 'పుష్ప' కూడా హిందీలో సూపర్ హిట్. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ పేరు కూడా '18 పేజీస్' పోస్టర్లపై ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. లవ్ స్టోరీ కావడంతో అక్కడ విడుదల చేస్తారో? లేదో? చూడాలి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి