ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వయస్సు ఎంత అనే ప్రశ్నకు ప్రభాస్ శ్రీను స్పందిస్తూ నా వయస్సు 35 ప్లస్ అని అన్నారు.ఇకపోతే ప్రభాస్ తో దిగిన ఫోటోను చూపిస్తూ ప్రభాస్ తో దిగిన ఫోటో మెమరబుల్ ఫోటో అని ప్రభాస్ శ్రీను అన్నారు. అయితే ప్రభాస్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇక అనుష్కతో కలిసి ప్రభాస్ శ్రీను దిగిన ఫోటోను యాంకర్ చూపించగా అనుష్క చాలా చీట్ చేసిందని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. 

ఇకపోతే లంకావిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో హోటల్ కు , లంకావికి 30 కిలోమీటర్ల దూరం ఉందని అయితే 30 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చానని అబద్ధం చెప్పి అనుష్క మోసం చేసిందని ప్రభాస్ శ్రీను తెలిపారు. అంతేకాదు కారుపై సైకిల్ ను ఉంచి కారులో అనుష్క వచ్చిందని కానీ అలా అబద్ధం చెప్పిందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. అయితే ఒక సినిమాలో అఘోర గెటప్ లో నటించానని ప్రభాస్ శ్రీను అన్నారు. ఇక  లైఫ్ లో సంతోషంగా ఉండాలని నమ్ముతున్నానని ఇతరులను ఫాలో కావాల్సిన అవసరం లేదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.

అంతేకాదు లైఫ్ స్టైల్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.ఇక  నాకు చిన్నవి అంటే ఇష్టం అని ఆయన వెల్లడించారు.అయితే ఒక్కోసారి నేనే వంట చేస్తానని ప్రభాస్ శ్రీను అన్నారు. ఇక ప్రతిరోజూ కష్టపడాలని ఆయన కామెంట్లు చేశారు. నాకు ఇన్ స్టంట్ నవ్వు బాగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే  జోక్ చెప్పి నవ్వించడం నాకు నచ్చదని ఆయన కామెంట్లు చేశారు.ఇక  ప్రభాస్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: