విజయ్ దేవరకొండకు ప్రేక్షకులలో ఎంతటి స్థాయిలో క్రేజీ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో ఒక డీసెంట్ హిట్ అందుకున్న తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన సంచలనాత్మక హీరోగా మారిపోయాడు. ఆ చిత్రం సాధించిన విజయం అంతా కాదు. దాంతో ఆయన కు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అటు నార్త్ లో కూడా ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేస్తున్న మరొక క్రేజీ ప్రాజె క్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సి నిమా కోసం రౌడీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించడంతో ఆమె నటిస్తున్న ఓ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా హిట్ అవ్వాలని వారు ఎంతగానో కోరుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో యశోద అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందగా ఈ సినిమా లో ఆమె హీరోయిన్ గా నటించింది.

నవంబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విజయం సాధిస్తే తప్పకుండా ఖుషి సినిమాకు ఆమె క్రేజ్ మరింతగా యాడ్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక లైగర్ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన విజయ్ దేవరకొండసినిమా ద్వారా విజయాన్ని అందుకోవాలని ప్రేక్షకులను అలరించాలని ముఖ్యంగా తన అభిమానులను ఆనందింప చేయాలి అని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా యొక్క షూటింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: