యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో బాద్ షా సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా , బండ్ల గణేష్మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 5 ఏప్రిల్ 2013 వ సంవత్సరం భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఎస్ ఎస్ తన సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాద్ షా మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ శ మూవీ ని నవంబర్ 19 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: