బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అయినటు వంటి బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్ హో నా హో (2003) , వాంటెడ్ (2009) వంటి మూవీ లకు సహాయ దర్శకుడు, సహాయ నిర్మాత గా పని చేసిన అర్జున్ కపూర్ ఆ తర్వాత 2012 వ సంవత్సరం లో విడుదల అయిన ఇషాక్ జాదే మూవీ తో హీరో గా కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమా లోని అర్జున్ కపూర్ నటన కు గాను ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు కు నామినేషన్ కూడా లభిందింది. అర్జున్ కపూర్ ఆ తర్వాత గుండే ,  2 స్టేట్స్  ,కి & కా  వంటి మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటు డిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అర్జున్ కపూర్ గత కొంత కాలంగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తో డేటింగ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది వరకు చాలా సార్లు అర్జున్ కపూర్ మరియు మలేక అరోరా లకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మలేఖ అరోరా ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొనసాగింది. ఇది ఇలా ఉంటే తాజాగా అర్జున్ కపూర్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మలేఖ అరోరా యస్ చెప్పింది. మల్లికా అరోరా తాజాగా తన ఇన్స్టా లో పెళ్లికి ఒప్పుకున్నట్లు పేర్కొంది. దానితో త్వరలోనే అర్జున్ కపూర్ మరియు మలేక అరోరా లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 12 సంవత్సరాలు చిన్నవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: