మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు.మొన్న గాడ్‌ఫాదర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ హిట్ ను అందుకున్నాడు.. ఇప్పుడు మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'.ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.


ఇటివలే విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ వింటేజ్ అవాతర్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ మాస్ పూనకాలు తెప్పించింది.తాజాగా 'వాల్తేరు వీరయ్య' నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి సోషల్ మీడియా సినిమాలో ఒక పోస్ట్ చేసారు..


వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ లది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు మ్యజికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య' ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది..సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: