యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మూవీ లలో బాద్ షా మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

మూవీ కి తమన్ సంగీతం అందించగా ,  సిద్ధార్థ్ మరియు నవదీప్ మూవీ లో ఇతర కీలక పాత్రలలో నటించారు. బండ్ల గణేష్మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన బాద్ షా మూవీ ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని , మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ మూవీ ని తిరిగి థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 కి పైగా థియేటర్ లు కన్ఫామ్ అయ్యాయి. ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్ లో కనుక మెరుగ్గా ఉన్నట్లు అయితే వీటిని 100 నుండి 120 కి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి బాద్ షా మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: