తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో శైలేష్ కొలను కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ఇదే మూవీ ని హిందీ లో హిట్ ది ఫస్ట్ కే అనే పేరుతోనే రీమేక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే శైలేష్ కొలను తాజాగా హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా సెకండ్ ది సెకండ్ కేస్ మూవీ ని తెరకెక్కించాడు. 

హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో అడవి శేష్ హీరో గా నటించిన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం , హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి ఈ మూవీ సీక్వెల్ గా తేరకెక్కడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో కూడా భారీగా విడుదల చేయనున్నారు. "యూ ఎస్ ఏ" లో ఈ మూవీ ని ఏ ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. ఈ సంస్థ ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో డిసెంబర్ 1 వ తేదీన ప్రీమియర్స్ వేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి హిట్ ది సెకండ్ కేస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: