
కత్రినా కైఫ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి 20 సంవత్సరాలు పైనే అవుతున్న ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాకుండా పారితోషకంలో కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కత్రినా కైఫ్ అందుకుంటున్న పారితోషకం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ లో చాలా తక్కువ మంది రూ.10 కోట్ల రూపాయలు మించి రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. ఇప్పుడు అలాంటి జాబితాలో కత్రినా కైఫ్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల రూపాయలు అందుకుంటోంది. బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సక్సెస్ లు తక్కువగా ఉన్నప్పటికీ హీరోయిన్లు రెమ్యూనరేషన్ లో మాత్రం పెంచేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ సినిమాల బడ్జెట్ గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో చాలావరకు తగ్గిపోయాయని చెప్పవచ్చు. అయినా కూడా కత్రినా కైఫ్ రెమ్యూనరేషన్ చూస్తుంటే ఇతర హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోయేలా ఉన్నాయంటు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం కత్రినా కైఫ్ రెమ్యూనరేషన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్ కంటే ముందున్న హీరోయిన్లలో ఆలియా భట్, దీపికా పడుకొని తర్వాతి స్థానం కత్రినా కైఫ్ సంపాదించిందని ఒక మీడియా సంస్థ ఇటీవలే తెలియజేసింది. ఇక ఐశ్వర్యరాయ్ కూడా ఒక చిత్రానికి రూ. 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. వివాహమైన కూడా కత్రినా కైఫ్ రేంజ్ తగ్గలేదని చెప్పవచ్చు.