టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి బాలకృష్ణ మరియు నయనతార. వీరిద్దరూ కలిసి ఇప్పటికే రెండు సినిమాలను చేసిన విషయం తెలిసిందే. మొదటగా సింహా అనే సినిమాలో చేసి వీరిద్ద రూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఈ జంట నందమూరి అభిమానులను ఎంతగానో ఆలరించింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువైపో యింది అలా ఆ తరువాత జై సింహా అనే సినిమాలో కలిసి వీరిద్దరూ నటించారు.

ఇలా రెండు సినిమాల తర్వాత వీరు మరొకసారి నటిస్తే బాగుంటుంది అని కోరికను కొంతమంది అభిమానులు వెల్లడిస్తున్నారు. ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు. త్వరలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యుమా హీరోయిన్ గా అనుకుంటున్నారని చాలా రోజులగా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా ఎంచుకుంటే బాగుంటుంది అనేది దర్శకుడు మాత్రం ఆలోచనట.

అయితే ఆమె కావాలి అన్న అభిమానులే ఇప్పుడు ఆమె బాలయ్య సినిమాలో హీరోయిన్ గా వద్దు అని చెబుతున్నారు. దానికి కారణం ఇటీవలే ఆమెకు పెళ్ళవడం. ఒక పెళ్లి అయిన హీరోయిన్ తో సినిమా చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదట ఏదేమైనా హ్యాట్రిక్ కాంబో వీరి కాంబినేషన్లో రావాలని కొంతమంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఇకపోతే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో శ్రుతి హసన్ కథానాయిక గా నటిస్తుండగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: