తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శైలిష్ కొలను గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడం తో దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీ కి సీక్వెల్ గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటించగా మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. 

ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ ను రేపు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు ఈ మూవీ లో హీరోగా నటించడం ,  ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో , హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు భారీ అజనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: