రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస క్రేజీ మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకుమించిన భారీ బడ్జెట్ మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు  కొన్ని వార్తలు ఇది వరకే బయటికి వచ్చాయి. అలాగే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒకే సెట్ లో జరగనున్నట్లు కూడా కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ కోసం మారుతి తయారు చేసుకున్న కథలో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు బయటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ను మరియు మాళవిక మోహన్ లను మూవీ యూనిట్ ఫైనల్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ యూనిట్ ప్రభాస్ సరసన నటించ బోయే మూడవ హీరోయిన్ కోసం సర్చింగ్ ను మొదలు పెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు మారుతిమూవీ లో ప్రభాస్ సరసన మూడవ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అద్భుతంగా సమాచారం ప్రకారం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన లవర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన రిద్దీ కుమార్ ను ప్రభాస్ సరసన హీరోయిన్ గా మారుతి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయితే రిద్ది కుమార్ కు భారీ సినిమాలో అవకాశం దక్కినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: