జయం రావి హీరోగా తెరకెక్కిన "కోమాలి" సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యి ప్రదీప్ రంగనాథన్  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనే హీరోగా ఇవాన హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా 'లవ్ టుడే'. ఈ సినిమాకి దర్శకుడు ప్రదీప్ రంగనాథనే కావడం విశేషం. 'ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ సినిమాన్ని నిర్మించడం జరిగింది. ఆల్రెడీ తమిళంలో విడుదలైన ఈ సినిమా ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక నవంబర్ 25న ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ సినిమాని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.దీంతో మొదటి నుండి ఈ సినిమా పై ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను సాధించడం జరిగింది.ఇక 'లవ్ టుడే' సినిమాకి తెలుగులో మొత్తం రూ.2.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 


ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. మంచి బంపర్  ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.1.10 కోట్లు షేర్ ను రాబట్టింది.ఇంకా బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి పోటీగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 'తోడేలు' వంటి సినిమాలు విడుదల అయినా.. అలాగే 'మాసూద' 'గాలోడు' వంటి సినిమాలు కూడా డీసెంట్ రన్ ను కొనసాగిస్తున్నా.. ఈ మూవీ ఇలా కలెక్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప అనే చెప్పాలి.ఇక పోతే ప్రదీప్ రంగనాధన్ తరువాత చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రదీప్  తన తరువాత సినిమాని టాలీవుడ్  ఎనర్జెటిక్  హీరో రామ్  తో చెయ్యబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: