ఇండస్ట్రీలో హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లు, సర్జరీలు సైతం చేయించుకుంటూ ఉంటారు. అంతేకాదు వెండితెరపై అయితే దేవకన్యలా మెరిసిపోతూ ఉంటారు మన హీరోయిన్స్.ఇక వాళ్ల అందంతో యూత్ ని కట్టిపడేస్తూ ఉంటారు. సినిమాలు చూసిన చాలామంది హీరోయిన్స్ అంతా అందంగా ఎలా ఉంటారు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఏమేమి వర్కౌట్స్ చేస్తారు ఇలా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 కాగా సమంత జిమ్లో వర్కౌట్స్ చేస్తూ యోగాసనాలు చేస్తూ 100 కిలోల బరువును కూడా ఈజీగా ఎత్తుతూ తన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటుంది.అయితే  ఈమె కేవలం సేంద్రీయ పద్ధతుల్లో పాటించిన కూరగాయలను మాత్రమే తింటూ ఉంటుంది.కాగా  అదే ఆమె ఫిట్నెస్ అండ్ గ్లామర్ సీక్రెట్ అని చెప్పవచ్చు.ఇకపోతే  మరొక హీరోయిన్ నయనతార. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో యూత్ ని కట్టిపడేస్తోంది నయనతార.నయనతార అందానికి మొదటి కారణం యోగా అని చెప్పవచ్చు.ఇక  వ్యాయామాలు తక్కువగా చేస్తూ యోగాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది నయనతార.

 బ్రేక్ ఫాస్ట్ లో కొబ్బరి తో చేసిన ఆహార పదార్థాలు తినడం ఆమె ఆరోగ్య రహస్యం.ఇకపోతే హీరోయిన్ త్రిష అందం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఆమె సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటిపోయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.అయితే  త్రిష తన అందాన్ని కాపాడుకోవడం కోసం వర్కౌట్స్ చేయడంతో పాటుగా ఎక్కువగా విటమిన్ సి ఉండే ఆహర పదార్థాలను తీసుకుంటూ ఉంటుందట. ఇక మన ముద్దుగుమ్మలు కీర్తి సురేష్ అలాగే సాయి పల్లవి వ్యాయామాలకంటే కాస్త డిఫరెంట్ గా ఎక్కువగా డాన్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఇకపోతే  నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయడం ఇలా హెల్త్ సీక్రెట్ అని చెప్పవచ్చు.ఈ ఇద్దరు హీరోయిన్లు బయట ఫుడ్ తో పోల్చుకుంటే ఇంట్లో వండిన భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.ఈ కోవలోకి శృతిహాసన్ కూడా చేరింది. కాగా ఆమె ఈ మధ్యకాలంలో రోజు వ్యాయామం చేయడంతో పాటుగా స్వయంగా తానే వండుకొని తింటోంది. షూటింగులకు తన ఇంటి నుంచి క్యారేజ్ కూడా తీసుకెళ్తుంది శృతిహాసన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: