పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పవర్ విజయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ లలో ఖుషి మూవీ ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోవడం మాత్రమే కాకుండా , అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇప్పటికి కూడా ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో ఒకటిగా నిలిచింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఖుషి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఖుషి మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 27 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కనుక థియేటర్ లలో రీ రిలీజ్ అయినట్లు అయితే కొత్త కొత్త రికార్డ్ లు నమోదు అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: