తన కంటే వెనకొచ్చిన హీరోలతో రెండు మూడు సినిమాలు రిపీటెడ్ గా చేసిన రాజమౌళి మహేష్ తో మాత్రం ఒక్క చిత్రం చేయలేదు. అలా అని దానికి స్పెషల్ రీజన్ అయితే ఏమీ లేదు.

బాహుబలికి ముందే మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది.ప్రొడ్యూసర్ కే ఎల్ నారాయణ దగ్గర రాజమౌళి మహేష్ మూవీ కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడటా.. బాహుబలి 2 తర్వాత ఆర్ ఆర్ ఆర్ చేయాల్సి వచ్చింది. అది ఒక రెండేళ్లలో పూర్తి చేసి మహేష్ మూవీ త్వరగా పట్టాలెక్కించాలని రాజమౌళి భావించారు. అనుకోని పరిణామాలు ఆర్ ఆర్ ఆర్ కి నాలుగేళ్ల సమయం పట్టేలా అయితే చేశాయి.


కరోనా పరిస్థితులు కూడా దారుణంగా దెబ్బ తీశాయి. రెండేళ్లు సరిగా షూట్ జరగలేదు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలపాలు కావడం. రాజమౌళి కొడుకు వివాహం ఇలా అనేకం కలిసి వచ్చాయి. కెరీర్లో ఏ చిత్రానికి కూడా చూడని ఇబ్బందులు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో ఫేస్ చేశారు. నిర్మాతలు, బయ్యర్ల నుండి ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మహేష్ మూవీ త్వరిత గతిన పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే మహేష్ తో రాజమౌళి మూవీ ని ప్రకటించారు. తన నెక్స్ట్ మూవీ మహేష్ తోనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏడాదికి పైగా మహేష్ స్క్రిప్ట్ పై రైటర్ విజయేంద్ర ప్రసాద్ పని చేస్తున్నారు. ఇక హీరో ఇమేజ్, మేనరిజంకి తగ్గట్లు రాజమౌళి కథలు సిద్ధం చేసుకుంటారు. బాహుబలికి ప్రభాస్ మాత్రమే అని ఆయన అనుకున్నారు. కాగా ఒక జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ జోనర్లో మూవీ చేయాలని రాజమౌళి ఎప్పటి నుండో అనుకుంటున్నారట. అలాంటి కథ మహేష్ కి బాగా సెట్ అవుతుందనేది రాజమౌళి నమ్మకం.


దీంతో ఆ జోనర్లోనే మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇచ్చారు. మహేష్ ఇంటెన్స్ యాక్టర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇంటెన్సిటీ అద్భుతంగా ఉంటుంది. అలాంటి సన్నివేశాలు అవలీలగా అయితే చేయగలడు. రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ జోనర్ మహేష్ కరెక్ట్ ఛాయిస్ అని రాజమౌళి భావన. ఇది యూనివర్సల్ స్టోరీ కూడాను. ఇక మే లేక జూన్ నుండి షూట్ స్టార్ట్ చేయాలనేది ప్రణాళిక అయితే అన్నారు. ఈ అప్డేట్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపిందని తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: