సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం మహేష్ బాబు , పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. కీర్తి సురేష్మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , తమన్మూవీ కి సంగీతం అందించాడు. సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు కోసం రాసుకున్న కథలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుండగా , రెండవ హీరోయిన్శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ కి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో యువ నటుడు అయినటు వంటి సాయి రోనాక్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నటుడు ఇది వరకు పాఠశాల ,  ప్రెషర్ కుక్కర్ , ఓదెల రైల్వే స్టేషన్ మూవీ లలో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు కి తాజాగా మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ లో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూ వీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: