ఆరుపదుల వయసులో కూడా ప్రస్తుతం పలు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో దూసుకుపోతున్న నటసింహ బాలకృష్ణ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బయటకు కనిపించడానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల చిన్న పిల్లల మనస్తత్వం అని ఆయనతో కలిసి పనిచేసిన ఎంతోమంది నటీనటులు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది


సినిమా విడుదల ఇంకా మొదలుకానే లేదు అప్పుడే తన తదుపరిచిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను షురూ చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.  కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడంతో అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను మొదటి షెడ్యూలు ప్రారంభించబోతున్నట్లు సమాచారం.


అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. వీరసింహారెడ్డి తో ఖచ్చితంగా మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన టాలెంట్ ను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి. ఏది ఏమైనా కామెడీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ యాక్షన్ సినిమాలను తెరకెక్కిస్తే చూడడానికి ఆ కిక్కే వేరబ్బా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: