2001లో ఇష్టం అనే సినిమాతో వెండితెర కి పరిచయమైంది అందాల తార శ్రేయ. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా  ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంది ఈమె .టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది శ్రేయ. అయితే ఒక వైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలలో నటించి మెప్పిస్తుంది ఈమె. ఇక వివాహం జరిగిన తర్వాత సినిమాలు తగ్గించిన ఈమె కూతురికి జన్మనిచ్చింది .దాని అనంతరం అడపా దడపా సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది.. అయితే తన పూర్తి సమయాన్ని భర్త కుతిరితో కేటాయిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది శ్రేయ.

ఇదిలా ఉంటే తాజాగా దృశ్యం 2 సినిమాల్లో నటించింది ఈమె .ఇక భారీ విజయాన్ని ఈ సినిమాతో మంచి విజయం అందుకోవడంతో మరోసారి టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే తాజాగా శ్రేయ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం ఎవరికీ చెప్పలేదు. శ్రేయ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఆమె అసలు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు దానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తయి. దీంతో తాజాగా ఈమె దృశ్యం 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఇంటర్వ్యూలో భాగంగా శ్రేయ చాలా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

అయితే ఇంటర్వ్యూలో భాగంగా శ్రేయ మాట్లాడుతూ నా కూతురు రాధా కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలని నేను అనుకున్నాను అంతే కాదు లావుగా అవుతుండడంతో దాని గురించి చింతించాల్సి వచ్చింది. ఇక అభిమానులకు మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్ గురించి ట్రోల్స్ చేస్తారు. అంతేకాదు నా బిడ్డ పై దృష్టి పెడతారు. అందుకే వాటిపై దృష్టి పెట్టకుండా సమయాన్ని వృధా చేయకుండా నా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు అని చెప్పుకొచ్చింది. తన ప్రెగ్నెన్సీ దాచిపెట్టడానికి గల కారణాన్ని శ్రేయ ఇప్పుడు బయట పెట్టడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: