అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును దక్కించుకుంది హీరోయిన్ రష్మిక మందన. ప్రస్తుతం  బాలీవుడ్,కోలీవుడ్ ,టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి అలా లేదు. ఇటీవల జరిగిన కాంతార సినిమా విషయంలో కన్నడలో అనధికారికంగా రష్మికపై బ్యాన్ కొనసాగింది అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కన్నడలో చాలా కాలంగా రష్మిక మందన సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కన్నడ ఇండస్ట్రీని రష్మికను వద్దు అనే పరిస్థితి వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. 

ఇక విజయ్ కి జోడిగా వారసుడు సినిమాలో నటించిన ఈమె ఈ సినిమా గనక సక్సెస్ అందుకుంటే ఈమె జోరు కంటిన్యూ చేస్తుంది అని చెప్పాలి.లేదంటే తమిళ్లో కూడా ఈమెకు అవకాశాలు లేనట్టే. ఇక ఈమె నటించిన పుష్పా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిన్న సినిమాలకు నో చెప్తోందట ఈమె. అంతేకాదు భారీగా పారితోషకం కూడా డిమాండ్ చేయడం వల్లే పుష్ప 2  సినిమా మాత్రమే ఆమె చేతిలో ఉందని. హిందీ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఈమె తీవ్రంగా నిరాశకు గురైందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె నటించిన హిందీ సినిమాలు కూడా పెద్దగా హిట్ అందుకోలేదు. ఇకపోతే గుడ్ బై సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది.

 దాని అనంతరం మిషన్ మజ్ను సినిమా అయితే కనీసం విడుదల కూడా కాలేదు. డైరెక్ట్ గా ఓటీటి లోనే విడుదల అయింది .అయినప్పటికీ ఈ సినిమా ఆకట్టుకోలేదు. రన్బీర్ కపూర్ కు జోడిగా సందీప్ గా దర్శకత్వంలో ఈ అనిమల్ సినిమాలో నటిస్తున్న ఈమె ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ సినిమా గనక మంచి సక్సెస్ అందుకుంటే ఈ అమ్మడి జోరు బాలీవుడ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. బాలీవుడ్ లో కూడా పుష్ప 2  సినిమా తరువాత మాత్రమే ఆఫర్లు వస్తాయి అని భావిస్తోంది ఈమె. అయితే  మొత్తానికి ఈమె కేర్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది అని చెప్పాలి. ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏం సినిమాలు చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఇదే ప్రశ్న రష్మికను అడిగిన కూడా టక్కున సమాధానం చెప్పడానికి ఆమె దగ్గర ఒక్క సినిమా పేరు కూడా లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: