ఓ సూపర్ స్టార్ తనను అభిమానించే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఎగబడి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం వెంటనే ఆ సూపర్ స్టార్ అక్కడి నుంచి వెళ్లి పోతారు.ఇంకా అలాగే తన బౌన్సర్స్ తో అందరిని కూడా నెట్టిస్తారు. ఇక తప్పదు అనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు అభిమానులతో ఫోటో దిగుతారు. మరి కొంత మంది అయితే ఆగ్రహంతో అభిమానుల చెంప చెళ్లుమనిపించడం, లేక వాళ్ల ఫోన్ ని విసిరి కొట్టడం లాంటి పనులు చేస్తారు.కేజీఎఫ్ 2 సినిమాతో  బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన  కన్నడ హీరో యశ్. ఈ సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా యశ్ ఎదిగాడు. ప్రస్తుతం  యశ్ నెక్ట్స్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగుళూరు సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో యశ్ పాల్గొనడం జరిగింది. అయితే యశ్ అభిమానుల కోసం ఊహించని పని చేసి వారిని ఆనందంలో ముంచెత్తాడు.


ఒక కార్యక్రమంలో పాల్గొన్న యశ్ తో.. అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకు రాగా.. అందరూ కలిసి ఓకే ఫోటోగా.. గ్రూప్ పిక్ తీసుకోవాలని షో వారు చెప్పారు.ఫ్యాన్స్ సెల్ఫీ కోసం యశ్ ని రిక్వెస్ట్ చేశారు.దీంతో అందరికీ సెల్ఫీ ఇచ్చేందుకు రాకింగ్ స్టార్ యశ్ ఒకే చెప్పారు. అలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మందికి పైగా ఒక్కొక్కరికి విడి విడిగా సెల్ఫీలకు ఫోజులిచ్చారు యశ్ . ఇక ఈ సెల్ఫీలు మొత్తం పూర్తి కావడానికి గంట నుండి రెండు గంటల సమయం పట్టింది. ఇక అభిమాన హీరోతో సెల్ఫీ తీసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ రోజుల్లో ఇంత ఓపిక తో ఉండి అందరికీ ఈ రకంగా సెల్ఫీ ఇచ్చి యశ్ నిజంగా రియల్ హీరో అనిపించుకున్నాడని ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: