ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులందరినీ అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. ఇక మొదటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే  బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ ట్రోఫీ అందుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ లో విన్నర్ లో ఒకరు కాదు ఇద్దరు అంటూ నాగర్జున ప్రకటించారు. ఎలా అంటే ఏకంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 40 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్ ఒకవైపు ఇక బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న రేవంత్ మరోవైపు నిలిచారు అని చెప్పాలి.


 ఇకపోతే అటు శ్రీహాన్ ఏకంగా 40 లక్షల ప్రైజ్ తీసుకున్నాడు. దీంతో 50 లక్షల ప్రైస్ మనీ లో మిగిలిన 10 లక్షలు  మాత్రమే ట్రోఫీ గెలుచుకున్న రేవంత్ అందుకున్నాడు అని చెప్పాలి. అయితే డబ్బు ముఖ్యం కాదు అని అభిమానుల సెంటిమెంట్ ముఖ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు శ్రీహన్  ఇక నాకు ఓటు వేసి గెలిపించిన వారి నమ్మకాన్ని పోగొట్టుకోలేను అంటూ అంతకుముందు తక్కువ ప్రైస్ మనీ ఆఫర్ చేసిన సమయంలో చెప్పాడు. కానీ నలభై లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ చేయగానే తాను తీసుకుంటాను అంటూ చెప్పేశాడు.


 ఈ క్రమంలోనే ఒకవేళ శ్రీహాన్ ప్లేస్ లో తాను ఉండి ఉంటే మాత్రం తప్పకుండా డబ్బులు తీసుకునే దాన్ని కాదు అంటూ బిగ్ బాస్ టాప్ త్రీ లో నిలిచిన కంటెస్టెంట్ కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీహాన్ డబ్బులు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నాడు. మీరు ఏం చేస్తారూ అంటూ అడిగిన ప్రశ్నకి.. నేనైతే డబ్బులు తీసుకోను.. గెలవడమే ముఖ్యం. అయితే మొదట్లో తక్కువ డబ్బులు ఆఫర్ చేసిన సమయంలో కీర్తి శ్రీహాన్ ఇద్దరు కూడా నో చెప్పారు. కానీ ఆ తర్వాత 40 లక్షలు అనగానే ఓకే చెప్పేసాడు శ్రీహన్. ఇలా శ్రీహాన్ డబ్బుకు కమిట్ అయ్యాడు అంటూ కీర్తి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: